MPEO Jobs in Nellore, AP

Notice : Nellore MPEOs Job Notification 2016 Official notification can be downloaded from here. The Application form will be displayed from October 1 till October 15 at this AP Nellore Government website.

 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ నందు బహుళార్థక ప్రయోజన విస్తరణ అధికారుల నియామకము కొరకు దరఖాస్తు 2016-17

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో , వ్యవసాయ శాఖ నందు ఖాళీగా ఉన్న 32 బహుళ ప్రయోజక విస్తరణాధికారులను [ MPEOs ] రిజర్వేషన్ సూత్రమును అనుసరించి రూ .8,000/- గౌరవ భృతిపై తాత్కాలిక ప్రాతిపదికన నియమించుటకు గాను ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.ఆర్.టి.నెo.693, ఎ మరియు సి (అగ్రి. 11) శాఖ , తేదీ.16.12.2014 మరియు వ్యవసాయ కమిషనరు మరియు సంచాలకులు , ఆంధ్రప్రదేశ్ , హైదరాబాదు వారి తాఖీదు సంఖ్య.ఎ-5(1)10/2014, తేది.18.12.2014, 13.06.2015 మరియు 07.2015 మరియు మెమో నెo .విస్తరణ.15/2015, తేది.19.04.2016 ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి .
పోస్టుల వివరములు
OC SC ST BC Total
PH A B D E
G W VH(W) HH OH G W G W G W G W G W G W
9 5 2 0 1 3 3 1 1 2 0 2 1 0 1 1 0 32
పైన కనపరచిన ’32’ పోస్టులు ఖాళీగా ఉన్న మండలముల వివరములు ఈ విధముగా
Sr.No. మండల్ స్థానాలు
1 జలదంకి 2
2 దగదర్తి 3
3 రాపూరు 3
4 ఓజిలి 3
5 నాయుడు పేట 3
6 పెళ్లకూరు 3
7 డి.వి.సత్రం 3
8 తడ 3
9 బాలాయపల్లి 3
10 డక్కిలి 3
11 సైదాపురం 3
ముఖ్య సూచన

ఎంపిక కాబడిన అభ్యర్థులు పైన కనపరచిన మండలములలో పనిచేయుటకు సమ్మతము ఉన్నవారే దరఖాస్తు చేసుకొనవలెను

అర్హతలు
1. వయస్సు అభ్యర్థులు జనరల్ కేటగిరి క్రింద తేది.31.07.2016 నాటికి 18 సంవత్సరములు తగ్గకుండా 40 సంవత్సరములు మించకుండా వుండవలెను . యస్.సి ., యస్.టి . మరియు బి.సి . అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో 5 సంవత్సరములు సడలింపు కలదు .
2. విద్యార్హతలు
ప్రాధాన్యతా క్రమము
కేటగిరి – 1 : బి.యస్సి .(అగ్రి), బి.యస్సి.(ఉద్యానవనం), బి.యస్సి.(మెట్ట వ్యవసాయం)
కేటగిరి – 2 : వ్యవసాయంలో పాలిటెక్నిక్ డిప్లొమో, డిప్లొమో ఇన్ సీడ్ టెక్నాలజీ / సస్యరక్షణ / సేంద్రీయ సాగు [ ANGRAU వారిచే గుర్తించబడినది ]
కేటగిరి – 3 : డిప్లొమో ఇన్ హార్టికల్చర్
కేటగిరి – 4 : వృక్ష శాస్త్రము సబ్జెక్టు కలిగియుండిన పట్టబధ్రులు
నియామకపు పద్ధతి
  • 80 శాతము వారి విద్యార్హతతో సాధించిన మార్కులు నుండి మరియు మిగతా 20 శాతము మార్కులు మౌఖిక పరీక్ష ద్వారా పరిగణలోనికి తీసుకొని ఎంపిక చేయబడును
  • యం.పి.ఇ.ఓ. పోస్టులలోని ఖాళీలలో 80 శాతము స్థానిక అభ్యర్థులకు మరియు 20 శాతము స్థానికేతరులకు అనగా రాష్ట్రములో ఇతర జిల్లాలలోని అభ్యర్థులకు కూడా కేటాయింపబడును .
  • గజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన జెరాక్స్ కాపీలు , యస్.యస్.సి. , విద్యార్హత,మార్కుల మొమోరాండం , కులం , స్టడీ సర్టిఫికేట్ , వికలాంగులకు సంబంధించి సంబంధిత ప్రభుత్వ డాక్టరుగారు ఇచ్చిన ధృవీకరణ పత్రము మొదలగునవి దరఖాస్తు ఫారంతో జతపరచవలెను . పూరించిన దరఖాస్తులు సరిగా లేని యెడల అటువంటి వాటిని పరిగణలోనికి తీసుకొనబడదు అని తెలియజేయడమైనది.
  • దరఖాస్తు ఫారములు పత్రికా ప్రకటన వెలువడిన 15 దినములలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవలెను .
  • పై నియామకములు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరు మరియు మేజిస్ట్రేటు వారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన కమిటీ ద్వారా జరుపబడును . పైన తెలుపబడిన నియామకమునకు సంబంధించిన ప్రకటన గురించి ఏవైనా మార్పులు చేర్పులు చేయుటకు మరియు ఎటువంటి నిర్ణయమునైనా తీసుకొనుటకు నియామకపు కమిటీకి అధికారము కలదు .

Please click here to view and download the official Nellor, AP, MPEOs Job Notification-2016

2 thoughts on “MPEO Jobs in Nellore, AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *